
379views
దేశవ్యాప్తంగా ఋణయాప్ ల దారుణాలు, అరాచకాలకు బలైన వారిలో బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులే అత్యధికం. ఆపదలో ఆదుకోవడానికి ఋణాలు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆపై అభాగ్యుల ప్రాణాలు తోడేస్తున్న ఆ ఆన్ లైన్ ఋణయాప్ లపై కొరడా ఝళిపించిది కేంద్రప్రభుత్వం. చట్టబద్ధమైన యాప్ ల జాబితా సిద్ధం చేయాలని… అవి మాత్రమే యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.





