News

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు

183views
  • గుంటూరు ఆత్మీయ సమావేశంలో వెంకయ్య నాయుడు

గుంటూరు: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థ పరిధులేమిటో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. అందుకే చట్టసభల్లో మాట్లాడే భాష.. సభ్యత, సంస్కారంతో ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​లు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందినవారు, నగర ప్రముఖులు పలువురు వెంకయ్యను కలిశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి