News

భారత సంతతి వారిపై పెరుగుతున్న జాతి వివక్ష ఘటనలు

210views
  • చట్ట సభ సభ్యురాలిగా ఉన్న ప్రమీళను దూషిస్తూ వీడియోలు

వాషింగ్ట‌న్‌: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారిపై జాత్యాహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. తిరిగి భారత్‌కు వెళ్ళి పోవాలంటూ ఓ వ్యక్తి పరుష పదజాలంతో దూషిస్తోన్న ఆడియో క్లిప్‌లను ఆమె ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సాధారణంగా రాజకీయ ప్రముఖులు తమ దుర్బలత్వాన్ని ప్రదర్శించరు. కానీ.. హింసను అంగీకరించలేం. కాబట్టి.. వీటిని బయటపెడుతోన్నా. ఇలాంటి దుశ్చర్యలకు ఆధారంగా నిలిచే జాత్యహంకారం, లింగ వివక్షనూ సహించేది లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి