
313views
-
16వ విడత చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల సందర్భంగా ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్టు ఇరుదేశాల సైన్యాలు ఈ సాయంత్రం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సమన్వయం, ప్రణాళికబద్ధంగా ఇరుదేశాల బలగాల ఉపసంహరణతో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొన్నాయి.





