
337views
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ళలో మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆమోదం తెలిపారు. ఎఫ్-16 యుద్ధవిమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత విక్రయం గురించి కాంగ్రెస్‌కు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమకు పాక్ ఒక ముఖ్య భాగస్వామి అని పేర్కొంది. ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతాపరమైన సమతౌల్యానికి ఎలాంటి హాని ఏర్పడదని చెప్పింది. అమెరికా నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి.





