News

భారత్‌లో పర్యాటకానికి పుష్కలమైన అవకాశాలు

310views

న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ‘హిందుస్థాన్ టైమ్స్ టూరిజం కాంక్లేవ్’లో ఆయన మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులకు, భిన్న సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయని చెప్పారు.

ఆధ్యాత్మిక పర్యాటకం, సాంస్కృతిక పర్యాటకం, వైద్య పర్యాటకం, అడ్వెంచర్ టూరిజం ఇలా భారతదేశంలో వివిధ రకాల పర్యాటకాల అభివృద్ధికి బాటలు పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ప్రైవేటు రంగం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

కరోనా అనంతర పరిస్థితుల్లో భారతదేశంలో పర్యాటక, ఆతిథ్య రంగాలను మరింతగా సుస్థిరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో స్విట్జర్లాండ్‌ను మైమరిపించే అద్భుతమైన పర్యాటక కేంద్రాలున్నాయని, వాటిని సందర్శించాలని ఆయన సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి