
363views
న్యూఢిల్లీ: వరదలతో అల్లాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చేయూతనందించింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్న పాక్‌కు తక్షణ సాయం అందించడంతో పాటు.. మార్కెట్‌లో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కూరగాయలు, పండ్లను భారత్ నుంచి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. వాఘ్ సరిహద్దు మీదుడా వీటిని పాక్‌కు చేరవేయనుంది. ప్రస్తుతం అఫ్గన్ టోర్‌ఖాం నుంచి పండ్లు, కూరగాయలు అందుతున్నా.. రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తీవ్రతను తగ్గించేందుకు భారత్ నుంచి పాక్ దిగుమతి చేసుకుంటోంది.
ఇక లాహోర్ మార్కెట్‌లో కిలో టొమాటో ధర రూ.500(పాక్ కరెన్సీ) కాగా, ఉల్లిపాయ కేజీ రూ.400 పలికింది. మిగతా నిత్యావసరాలది అదే బాట. బలోచిస్తాన్, సింధ్, సౌత్ పంజాబ్ ప్రావిన్స్‌ల వరదల కారణంగా పంట, నిల్వలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని తెలుస్తోంది.





