News

సామాన్య భక్తులకు సూర్యనారాయణ స్వామి అంతరాలయ దర్శనం

385views

శ్రీ‌కాకుళం: అరసవల్లి ఆదిత్యుని క్షేత్రంలో కొత్త ఆర్జిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు దాతలు, ప్రముఖులకే దక్కిన అంతరాలయ దర్శ నం ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమోదాన్ని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి శనివారం వరకు ప్రత్యేక సమయాల్లో అంతరాలయ దర్శనానికి ప్రత్యేకంగా టిక్కెట్లను ప్రవేశపెడుతూ దే వదాయ శాఖ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ప్ర త్యేక సూర్యనమస్కారాల పూజలకు కూడా ప్రత్యేక టిక్కెట్లను నిర్ణయిస్తూనే.. అష్టోత్తర, సహస్ర నామార్చనలు, భోగ సమర్పణ టిక్కెట్ల ధరలను సైతం స్వ ల్పంగా పెంచుతూ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచే ఈ కొత్త ధరల విధానాలను అమలు చేయనున్నట్టు ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌ ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి