
బెంగళూరు: వినాయక చవితి నేపథ్యంలో బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆగస్టు 31న నగరం అంతటా మాంసం అమ్మకాలను, జంతు వధను నిషేధించింది. అందుకు సంబంధించి సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేస్తూ, పౌర సంఘం సంపూర్ణ మాంస నిషేధం అమలులో ఉంటుందని, BBMP పరిమితుల్లోని అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు.
కన్నడలో రాయబడిన ఈ నోటీసును పరిశీలించగా.. “గణేశ చతుర్థి” రోజున జంతు వధ, మాంస విక్రయాల నిషేధం. బుధవారం, ఆగస్ట్ 31, “గణేశ చతుర్థి” సందర్భంగా, జాయింట్ డైరెక్టర్ (పశుసంవర్ధక) బుర్హత్ బెంగుళూరు మహానగర కార్పొరేషన్ పరిధిలోని స్టాల్స్‌లో జంతువులను వధించడం, మాంసం అమ్మడం పూర్తిగా నిషేధించారు అని తెలిపారు. ఈ సర్క్యులర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అధినేత డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఇవన్నీ అనవసర వివాదాలకు దారి తీస్తున్నాయని అన్నారు.
Source: NationalistHub