News

చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉంది

177views

* అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

మెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు చెక్ ‌పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫౌండేషన్‌ సెమినార్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు.

భారత్‌ నుంచి చైనాకు రెండు సవాళ్లు ఎదరవుతాయని గిల్డే పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని చైనాను బలవంతం చేస్తున్నారని, కానీ చైనా వాస్తవానికి పక్కనున్న భారత్ ‌ను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాసియాలో భారత్ బలమైన దేశంగా ఉండటం అమెరికా, జపాన్ ‌కు అవసరం అన్నారు. భారత్ ‌తో  జాగ్రత్తగా ఉండాలనే స్థితికి చైనాను తీసుకురావాలని ఆయన భారత్ కు సూచించారు.

భారత్, అమెరికా సైన్యాలు గతేడాది అక్టోబర్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని గిల్డే గుర్తు చేశారు. అప్పుడే చైనాకు భారత సవాల్ అవుతుందని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం గడిపినట్లు గిల్డే చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.