News

వ‌చ్చే నెల 26 నుంచి దుర్గమ్మ గుడిలో దసరా వేడుకలు

422views

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు అయిదోతేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాలను నిర్వహించేందుకు అధికారులతో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమన్వయ సమావేశం నిర్వహించారు.

కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తరుణంలో ఈ దసరాకు భారీగా భక్తులు తరలి వస్తారనే అంచనా ఉందని.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యనారాయణ ఆదేశించారు. దసరా ఉత్సవాల సమయంలో రోజు 30 వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని.. మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. దూరప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని.. ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి