
318views
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టి సెమీ ఫైనల్స్‌కి చేరి పతకం ఖాయం చేసుకున్నారు. పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా మెడల్ అందుకోనున్న జోడీగా చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన యుగో కొబాయషీ, టకూరో హోకి జోడీపై 24-22,15-21,21-14తో గెలిచారు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో జపాన్ రెండో స్థానంలో ఉంది.





