News

ఆలయాల్లోని క్షురకులకు కనీస వేతనం చెల్లించాలి

363views
  • దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఘెరావ్ చేసిన నాయీ బ్రాహ్మణులు

విజయవాడ: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఘోరావ్‌ చేశారు. మాజీమంత్రి వెలంపల్లి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ విజయవాడ గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయం వద్దకు నాయీ బ్రాహ్మణులు వచ్చారు. అక్కడ మంత్రి కొట్టు కారు వద్ద అడ్డంగా నిలిచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షౌరకులకు కనీసం వేతనం ఇవ్వాలని నిర్ణయిస్తూ సిద్దం చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిశీలిస్తామని మంత్రి చెప్పినా పరిస్థితిలో మార్పురాలేదు. పోలీసుల జోక్యంతో మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి