News

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం

390views

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూ­ర్యు­డిపై పరిశోధనలు చేసేం­దు­కు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది.

ఇప్పుడు మ‌ళ్ళీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ–సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ మీడియాకు వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి