News

సిసోడియా దేశం విడిచి వెళ్ళ‌కుండా సీబీఐ నోటీసులు

340views

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియాపై సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్ళిపోవడానికి వీల్లేకుండా పోయింది. ఆయనతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో 12 మందిపైనా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని శనివారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ తర్వాత లుక్‌ఔట్‌ నోటీసులు జారీ కావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి