News

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో మంకీ పాక్స్ నిర్ధారణ కిట్

406views
  • విశాఖపట్నంలో ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు

విశాఖపట్నం: దేశంలో మంకీపాక్స్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలోని మెడ్​టెక్ జోన్​లో ఆర్టీపీసీఆర్ టెస్ట్​ కిట్​ను విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా సంస్థ తయారు చేసిన ఈ కిట్​ను విశాఖ మెడ్​టెక్ జోన్​లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చేశారు.

మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోందని.. ఇప్పటికే 75 దేశాలను చుట్టేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. మంకీ పాక్స్​ను గుర్తించేందుకు ఈ కిట్​ను తొలిసారి భారత్​లో తయారు చేసి.. మేకిన్ ఇండియాలో భాగస్వాములమయ్యామని సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సురేష్ వజిరాని వెల్లడించారు. పూర్తిగా దేశీయ సాంకేతికత పరిజ్ఞానంతోనే ఈ కిట్ రూపొందించినట్టు వివరించారు.

Source: Sakshi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి