News

భారత సైన్యానికి అధునాతన బోట్లు

333views

న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్‌ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ బోట్‌లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేర్చగలదు. దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక శక్తి పెరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి