News

గుజరాత్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం

383views

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్​ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్​లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు.

నిఘా వర్గాల సమాచారం మేరకు భరూచ్​లోని అంక్లేశ్వర్​లో ముంబయి ఏఎన్​సీ దాడులు నిర్వహించింది. ఇక్కడ ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడులు చేసింది. ఏకంగా 513 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ఈ కేసులో ఓ మహిళతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1026 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ యూనిట్ తయారీ యజమాని గిరిరాజ్​ దీక్షిత్​ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు మూడోతేదీన కూడా ముంబయి యాంటీ నార్కొటిక్స్ సెల్ భారీగా డ్రగ్స్​ను సీజ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి