News

తాజ్ ఎక్స్ ప్రెస్‌లో బాంబు కలకలం!

352views

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర‌ దినోత్సవాన తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు కలకలం రేగింది. ఢిల్లీ నుంచి బౌంద్​ వెళ్ళే తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు ఉన్నట్టు ఓ వ్యక్తి కాల్​ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు.

ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మధురాలో జరిగింది. సోమవారం.. తాజ్​ ఎక్స్​ప్రెస్​లోని డీ2 బోగిలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​ చేశారని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ వెళ్ళేలోపు పేలుతుందని హెచ్చరించారని చెప్పారు. వెంటనే అప్రమత్తమై రైలును మ‌ధురా రైల్వే స్టేషన్​లో నిలిపి తనిఖీలు చేశామని పేర్కొన్నారు.

తాజ్​ ఎక్స్​ప్రెస్​.. మ‌ధురా జంక్షన్​ రైల్వే స్టేషన్​కు ఉదయం 7:29 కు చేరుకోగానే నిలిపివేశాం. ప్రయాణికులను కిందకు దించి పూర్తిగా తనిఖీలు చేశాం. బాంబ్​ డిస్పోజల్​ స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​, జీఆర్పీ, ఆర్పీఎఫ్​, స్థానిక పోలీసులతో కలిసి ప్రతి కోచ్​ను తనిఖీ చేశాం. దీనికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. తనిఖీలు చేపట్టిన అనంతరం రైలు వెళ్లేందుకు అనుమతిచ్చాం” అని స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ సుశీల్​ కుమార్​ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. నిందితుడిని గుర్తించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి