
358views
-
ఉద్రిక్త పరిస్థితులు, 144 సెక్షన్ విధింపు
శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గలో వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కర్ణాటకలో వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఆయన బ్యానర్‌ను తొలగించేందుకు టిప్పు సుల్తాన్ అభిమానులు ప్రయత్నించారు. దీంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఉడుపి కాంగ్రెస్ నేతలు పోలీసులను కోరారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలే చింపి వారే గొడవకు దిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అల్లర్లు సృష్టించేందుకు బ్యానర్‌ను చింపేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.





