News

వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

252views

భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్‌ మంజూరు చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.

అయితే.. గ్రేటర్‌ ముంబయి దాటి ఎక్కడికీ వెళ్లకూడదని నిబంధన విధించింది. ఈ మేరకు వరవరరావుకు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్ ‌లో 2018 జనవరి 1న జరిగిన హింసతో పాటు నక్సల్స్ ‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావు సహా ఐదుగురిని 2018లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.