News

4 వందల ఏళ్ళ నాటి పురాతన విగ్రహాం స్వాధీనం

352views

చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్‌(ఐడల్‌ వింగ్‌)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ళ నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్‌ వింగ్‌ బృందం అండర్‌ కవర్ ఆపరేషన్‌ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్‌, కుమార్‌వేల్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు.

దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు.

ఈ క్రమంలోనే ముస్తఫ్‌ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి – మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. అయితే, పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది.

ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, రుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా  తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్టు తెలిపాడు. అయితే, సెల్వకుమార్‌ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్ళుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్‌ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి