News

ముంబైలో డ్ర‌గ్స్‌, కేర‌ళ‌లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

435views

ముంబై: ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబై క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు చేసిన అధికారులు.. ఐదుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1400 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

కేర‌ళ‌లో…

కేరళలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరకడం కలకలం సృష్టిస్తోంది. పాలక్కాడ్‌ జిల్లా షోర్‌నూర్ ప్రాంతంలోని ఒంగళ్లూరులో ఎనిమిది వేల జిలెటిన్‌ స్టిక్స్‌ దొరికాయి. 40 పెట్టెల్లో వీటిని ఒక క్వారీ సమీపంలో వదిలేసి వెళ్ళారు. క్వారీలో పేలుడు జరపడం కోసం తెచ్చి వాటిని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. వాటిని గుర్తించిన పోలీసులు షోర్‌నూర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి