
459views
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ సన్మాన కార్యక్రమం రద్దయింది. సాంస్కృతిక సంస్థలు రంగ్లీలా, ఆగ్రా థియేటర్ క్లబ్ ఆమెను సత్కరించేందుకు ఏర్పాట్లు చేశాయి. అయితే ఆమె రచించిన నవలలో హిందూ దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ఓ పిటిషన్ దాఖలవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
రంగ్లీలా ప్రతినిధి అనిల్ శుక్లా మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీపై హత్రాస్ జిల్లాకు చెందిన సందీప్ కుమార్ పాఠక్ ఫిర్యాదు చేశారని చెప్పారు. శివపార్వతులపై గీతాంజలి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారని తెలిపారు. ఈ నేపథ్యంలో గీతాంజలిని సత్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రద్దు చేశామని చెప్పారు.





