News

కామన్వెల్త్ క్రీడల్లో కొనసాగుతున్న భారత క్రీడాకారుల జోరు

414views

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత జోరు కొనసాగుతోంది. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్‌ లిఫ్టర్‌ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్‌ చేసిన అచింత.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు.. మూడో ప్రయత్నంలో 143 ఎత్తి గేమ్స్‌ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి