News

తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు సాయం పెంపు

381views

న్యూఢిల్లీ: తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు ఆర్థిక సాయం పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి పట్ల మానవతావాద దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ట్వీట్ ద్వారా ఆయన తెలిపారు.

రాజ్‌నాథ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం వారికి ఇకపై నెలకు రూ.3,000 చొప్పున అందజేస్తారు. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ.1,000 లభించేది. ఈ సాయం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారికి గౌరవప్రదంగా, మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలుగుతుంది.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని పిల్లలకు అందజేస్తారు. రక్షా మంత్రి ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఫండ్ ఈ నిధులను సమకూర్చుతుంది.

మాజీ సైనికుల చట్టబద్ధ సంతానానికి ఈ పథకం వర్తిస్తుంది. 21 ఏళ్ళ వయసు లోపుగల కుమారుడు, అవివాహిత కుమార్తె ఈ పథకం క్రింద లబ్ధి పొందేందుకు అర్హులు. జిల్లా సైనిక్ బోర్డులు ఈ దరఖాస్తులను సిఫారసు చేస్తాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి