
488views
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా కొట్టారు. జులై 27న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం ఏడు గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు ఈడీ అధికారులు ముంబయిలోని రౌత్ ఇంటికి చేరుకున్నారు.
Source: Tv9
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





