News

ఆగస్టు 2 నుంచి సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చండి

469views

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ రెండోతేదీ నుంచి ఆగస్ట్ 15 వరకూ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో డీపీగా (డిస్‌ప్లే పిక్చర్)గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని సూచించారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోందని చెప్పారు. దేశంలో ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని పిలుపు నిచ్చారు.

ఆగస్టు 2న జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా ఆ రోజు నుంచి ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని దేశ ప్రజలను మోదీ కోరారు. 91వ ఎడిషన్ ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం ఒక అద్భుతమైన, చారిత్రక ఘట్టానికి సాక్ష్యమిస్తోందని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి