
487views
రాష్ట్రపతిగా గిరిజన మహిళ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం పట్ల వనవాసీ కళ్యాణాశ్రమ్ హర్షం వ్యక్తం చేసింది. భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నికను తాము స్వాగతిస్తున్నామని పేర్కొంటూ వనవాసీ కళ్యాణాశ్రమ్ అఖిల భారతీయ హిత రక్షా ప్రముఖ్ శ్రీ గిరీశ్ కుబేర్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలూ ఆమెను మనస్ఫూర్తిగా ఆహ్వానించడం కూడా ఆనందకరమైన పరిణామమని ఆయన తెలిపారు. ఒక గిరిజన మహిళ దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్టించడం వనవాసీ సమాజానికే కాక యావత్ భారతీయ సమాజానికీ లభించిన అత్యున్నత గౌరవమని శ్రీ కుబేర్ అభిప్రాయపడ్డారు.
శ్రీమతి ముర్ము గారి హయాంలో రాబోయే రోజులలో వనవాసీలు, నగరవాసుల జీవితాలు మాత్రమే కాక యావత్ దేశం గౌరవాన్ని, వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని వనవాసీ కళ్యాణాశ్రమ్ వ్యక్తం చేస్తోంద శ్రీ కుబేర్ ప్రకటించారు.





