News

జనాభా నియంత్రణకు ఎలాంటి చట్టాలు తీసుకురావడం లేదు

471views

న్యూఢిల్లీ: దేశంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం చట్టమేమీ తీసుకురావడం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. రాజ్యసభలో సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిటాస్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 2045 నాటి కల్లా దేశంలో జనాభా పెరుగుదలను స్థిరత్వానికి తీసుకురావాలన్న లక్ష్యంతో జాతీయ జనాభా విధానం 2000, జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం కుటుంబ నియంత్రణకు కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల జనాభా వృద్ధికి క‌ళ్ళెం వేయడంలో విజయం సాధించినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి