
-
సగం మనిషి, సగం జంతువులూ దేవుళ్ళేనా?
-
అదిల్ చిస్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్: హిందూ దేవతలపై అజ్మేర్ దర్గాలో మరో మత ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్, హనుమాన్ కూడా దేవుళ్ళా? అని అజ్మేర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఈ వీడియో జూన్ 23న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. అయితే, హిందూ సోదర సోదరీమణుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తాను బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మాత్రమే ప్రశ్నలు వేశానని అదిల్ చిస్తీ మరో వీడియో విడుదల చేశారు. తన వీడియోలో కొంత భాగాన్నే చూపారని తెలిపారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు ప్రకటించారు.
Source: Andhra jyothi





