
500views
-
జాతీయకవి చక్రవర్తి దామరాజుపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అమరావతి: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శం. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని వర్ధమాన దేశాలు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ కుయుక్తులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహించిన కార్యక్రమంలో ‘జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయోద్యమంలో సాహితీవేత్తల పాత్ర ఎనలేనిదన్నారు.





