News

కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య!

404views

చెన్నై: తమిళనాడులో పెళ్ళ‌యిన మూడేళ్ళ‌కే లవ్ జిహాద్ బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్లిం అత్తమామలు కట్నం కోసం వేధించారని, ఆమెను హత్య చేసి ఉంటారని బాధిత హిందూ యువతి తండ్రి ఆరోపించారు.

చెన్నైకి చెందిన మురుగన్ పెద్ద కూతురు అరుంధతి తన కాలేజీ మేట్ షాహిద్ ఇబ్రహీంతో ప్రేమలో పడింది. ఆమె మూడేళ్ళ కింద‌ట తన తల్లిదండ్రులను ఎదిరించి, ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకుంది. 2020లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అత్తమామల నుంచి త‌న కుమార్తె వేధింపులకు గుర‌యింద‌ని ఆమె తండ్రి పోలీసుల వ‌ద్ద ఆరోపించాడు.

ఆమె ప్రసవించిన వెంటనే అరుంధ‌తితో ఇంటి పనులు చేయించి, కట్నం కావాలని భర్త, అత్తమామలు హింసించారు. కూతురి వేధింపులు భరించలేక మురుగన్ తొలుత ఐదు సవర్ల బంగారం ఇచ్చాడు. కానీ, ముస్లిం కుటుంబం దానితో సంతృప్తి చెందలేదు, వేధింపులను పెంచింది.

జూన్ 22న అరుంధ‌తి వారి బారి నుంచి తప్పించుకుని తన తండ్రిని సంప్రదించి, వేధింపుల గురించి చెప్పి, బోరుమంది. షాహిద్, అతని కుటుంబ సభ్యులు అరుంధ‌తిని వెనక్కి పంపాలని డిమాండ్ చేయడంతో, మురుగన్ అందుకు అంగీక‌రించ‌లేదు. ఈ విషయమై షాహిద్ మురుగన్‌పై ఫిర్యాదు చేశాడు. తరువాత, అతను ఆ ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నాడు. దీంతో మురుగన్ మనసు మార్చుకుని, తన కుమార్తెను పంపాడు.

జూలై 3న షాహిద్ సోదరి మురుగన్‌కు ఫోన్ చేసి తన కూతురు తమ ఇంటి మూడో అంతస్తు నుంచి దూకిందని చెప్పింది. మురుగన్ తన కుమార్తెను కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి చూసేందుకు వెళ్ళాడు. అక్కడ ఆమె చనిపోయినట్టు నిర్ధారించుకున్నాడు. ఆమె శరీరంపై గాయాలు, ఆమె దూకిన టెర్రస్ ఫ్లోర్‌లో చాలా రక్తపు మరకలను మురున్ గమనించాడు. షాహిద్‌, అతని కుటుంబ సభ్యులు తన కుమార్తెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నందున హత్య కోణంలో దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండల రెవెన్యూ డివిజనల్ అధికారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి