News

ప్రధాని భీమ‌వ‌రం పర్యటనలో బ్లాక్ బెలూన్లు… ఎస్పీజీ సీరియస్

138views

భీమ‌వ‌రం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పోలీసుల భద్రత లోపం కొట్టొచ్చిన‌ట్టు కనిపించింది. గన్నవరం నుంచి భీమవరానికి హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల కొద్ది నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలిపారు.

ఈ బెలూన్లు హెలికాప్టర్‌కు దూరంగా గాల్లో ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఒకవేళ హెలికాప్టర్‌కు తగిలితే ఎలా..? ఏమైనా ప్రమాదం జరిగి ఉంటె..? మోదీ పర్యటిస్తున్న సమయంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన భద్రత పోలీసులు ఏమైపోయారు..? వారి భద్రత ఏది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రధాని పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరడంపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సీరియస్ అయ్యింది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ అంటోంది. బెలూన్ల తరహాలోనే డ్రోన్లను ఎగరేస్తే పరిస్థితేంటని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్పీజీ నివేదిక కోరినట్లు సమాచారం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి