News

శ్రీపద్మావతి పరిణయోత్సవాలు

235views

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శనివారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి.శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా రెండవరోజు నిర్వహించారు. ఆ తరువాత ఆస్థానం జరిగింది. అనంతరం వెంకటేశ్వర స్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారంతో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి.