93
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, తన మొదటి యుద్ధ విమానం తేజస్ (LCA తేజస్ MK1A)ని జూలైలో భారత వైమానిక దళానికి అందజేసేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేపట్టింది. జూలై నాటికి అన్ని ట్రయల్స్ పూర్తి చేసి వైమానిక దళానికి అందజేయాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ భావిస్తోంది. ఈ యుద్ధవిమానం తేజస్ ఎంకే-1 తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. 43.4 అడుగుల పొడవు, . 14.5 అడుగుల ఎత్తు కల్గిన ఈ ఫైటర్ జెట్ గరిష్టంగా గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. పోరాట పరిధి 739 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించేలా రూపొందించారు.