News

సింహాచలం కొండకు వచ్చే భక్తులకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు

102views

ఉత్తరాంధ్రలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం విశాఖలోని సింహాచలం కొండకు వచ్చే భక్తులకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కృష్ణాపురం గోశాలలో ప్రత్యేక పూజల అనంతరం
అలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు బస్ ను ప్రారంభించారు. అదే బస్సులో దేవస్ధానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తో కలిసి సింహగిరికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ సింహగిరిపై కార్బన్ కాలుష్యాన్ని నివారించడానికి దేవస్ధానం “ఈ-బస్సు”లను ప్రవేశపెడుతోందన్నారు.మొత్తం ఐదు బస్సులు ప్రతిపాదించామని వాటిలో మొదటిది అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ బస్సన్నారు.సింహగిరి ఘాట్ రోడ్డు లో మాత్రమే ఈ బస్సులు నడుపుతామని భక్తులకు అందుబాటు ధరల్లో టిక్కెట్లు నిర్ణయించినట్లు తెలిపారు.