
343views
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిపుర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలానే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండ్‌ను మోదీ మరోసారి పుతిన్‌కు వివరించినట్టు తెలుస్తోంది.దీంతో పాటు 2021 డిసెంబర్‌లో పుతిన్.. భారత్‌లో పర్యటించినప్పుడు జరిగిన ఒప్పందాల అమలుపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించినట్లు పీఎంఓ వెల్లడించింది.





