
463views
-
కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వయనాడ్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.





