News

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన

411views

న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వ‌చ్చేనెల అయిదో తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి