News

జర్మనీలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

435views

మ్యునిక్​: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. మ్యునిక్​లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేడు, రేపు జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ సహా అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా తదితర ప్రజాస్వామ్య దేశాలను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న జర్మనీ ఆహ్వానించిందని శనివారం ఓ ప్రకటనలో మోదీ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి