News

తిరుమలకు పోటెత్తిన భక్తులు… సర్వ దర్శనానికి 20 గంటల సమయం

344views

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. నందకం వరకు వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 20 గంటల సమయం పట్టింది. రద్దీ అధికంగా ఉండడంతో క్యూలైన్లలో అవస్థ పడుతున్నారు. దీనికి తోడు ఎండవేడిమి కారణంగా భక్తులు ఇబ్బంది పడ్డారు. గురువారం శ్రీవారిని 68,873 మంది దర్శించుకున్నారు. రూ.4.44 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి