
తిరుపతి: తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది.
కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరణ
శ్రీవారి ఆశీస్సులతో ఆగస్టు 7వ తేదీ ఉదయం 8 గం.07 నిమిషాల నుండి 8 గం. 17 నిమిషాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్రీకృత కార్యాలయాన్ని ఈవో ప్రారంభించి, కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒకటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు, వధువు నుండి 20 మంది, వరుడి నుండి 20 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, స్వామివారి ఆశీస్సులతో ఉచితంగా జరిపించుకోవాలన్నారు. జూలై 1 నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతందన్నారు.





