News

రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!

376views
  • శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం

  • కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్ల‌డి

న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి దిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. రామాయణ యాత్ర పేరుతో 18 రోజులపాటు కొనసాగే ఈ రైలు దేశంలో రాముడితో సంబంధం ఉన్న వివిధ ప్రదేశాలతోపాటు నేపాల్‌లోని జనక్‌పురి వరకు సాగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

పర్యాటక శాఖ రైల్వే శాఖతో కలిసి కృష్ణ సర్క్యూట్‌, బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌లకు భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైళ్లను నడపనున్నట్టు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. రామాయణ యాత్రకు రైలును ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు. భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని, వారసత్వ సంపదను తెలియజేయడమే భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ప్రారంభం వెనుక ఉన్న ఉద్దేశమని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి