247
న్యూఢిల్లీ: జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్స్ ఆహ్మానం మేరకు జి7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 26, 27 తేదీలలో దక్షిణ జర్మనీలోని షోల్స్ ఎల్మావ్‌కు చెందిన ఆల్పైన్ కాజిల్‌ని సందర్శించనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో పరిస్థితితో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను జి7 సదస్సు చర్చించనున్నది. ఈ పర్యటన అనంతరం..ఇటీవల కన్నుమూసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు సంతాపం తెలియచేసేందుకు జూన్ 28న ప్రధాని మోడీ అబు దాబిని సందర్శించనున్నారు.