
460views
మైసూర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేశారు. మానవత్వం కోసం యోగా(యోగా ఫర్ హ్యుమానిటీ) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. మోదీతో పాటు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.
Source: EtvBharat





