News

అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి

473views

భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని, ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని‌వీర్‌లో ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌‌పై రాజకీయం చేయొద్దన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికీ నష్టం జరగదన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌‌లు ఇస్తామంటున్నారని చెప్పారు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు.

తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి