News

గురుద్వారాపై దాడి నేప‌థ్యంలో… ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు ఇ-వీసాలు

564views

న్యూఢిల్లీ: కాబూల్‌లోని బాగ్-ఎ-బాలా పరిసర ప్రాంతంలోని గురుద్వారా కార్తే పర్వాన్ వద్ద జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత 100 మందికి పైగా ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు ‘ప్రాధాన్యత’పై ఇ-ఎమర్జెన్సీ వీసాలు మంజూరు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

తీవ్రవాద బెదిరింపుల కారణంగా భయంకరమైన ప్రమాదంలో ఉన్న సిక్కులు, హిందువుల‌కు ఈ-వీసాలు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర్చుతాయ‌ని పేర్కొంది. భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సంప్రదించి ఇప్పటికే ఎమర్జెన్సీ వీసాలు ఇచ్చామని అధికారులు పేర్కొన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి