
359views
న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్ పథకంపై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో సంస్కరణలు, పనితీరులో మార్పులు రూపాంతరం చెందకపోతే భారత్ ఎలా గొప్పగా మారుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు.
లెఫ్టినెంట్ జనరల్ పూరి ఆర్మీ కాన్ఫరెన్స్‌లో అగ్నిపథ్ కార్యక్రమాన్ని వివరించిన తీరును ప్రస్తావిస్తూ దీనితో ఈ పథకంపై ఎలాంటి సందేహం ఉండబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో రాజకీయాలు ఉండకూడదని చెప్పవలసి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ విధానాలపై కూడా దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Source: Nijamtoday





