
లక్నో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగేళ్ళ సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని పోలీసు, పోలీసు సంబంధిత ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రకటించారు. అగ్నిపథ్ పథకం యువతను దేశ, సమాజ సేవకు సిద్ధం చేస్తుందని, వారికి గర్వించదగ్గ భవిష్యత్‌ను ఇస్తుందని ఆయన కొనియాడారు. దీనికి ఒకరోజు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పథకంపై స్పందిస్తూ ఇలాంటి ప్రకటనే చేశారు. పారామిలిటరీ దళాల్లో, అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు కల్పించే సమయంలో అగ్నివీర్‌లకు ప్రాధాన్యత ఇస్తామని హోంశాఖ ప్రకటించింది.
‘‘అగ్నిపథ్ యోజన అనేది యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి తీసుకున్న నిర్ణయం. ఇది స్వాగతించాల్సిన నిర్ణయం” అంటూ కొనియాడారు.
Source: Nijamtoday





